51 వేల ఉద్యోగాలే ల‌క్ష్యంగా మాల్స్ లో సౌదీయేష‌న్ నిబంధ‌న‌ల అమ‌లు

- April 08, 2021 , by Maagulf
51 వేల ఉద్యోగాలే ల‌క్ష్యంగా మాల్స్ లో సౌదీయేష‌న్ నిబంధ‌న‌ల అమ‌లు

సౌదీ:సౌదీలోని మాల్స్, రెస్టారెంట్ ఔట్ లెట్స్, మార్కెట్ ఔట్ లెట్స్ లో స్థానికుల‌కు 51 వేల ఉద్యోగాల‌ను క‌ల్పించ‌ట‌మే ల‌క్ష్యంగా సౌదీయేష‌న్ నిబంధ‌న‌లు అమ‌లు చేసేలా కింగ్డ‌మ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం మూడు మంత్రివ‌ర్గ తీర్మానాల అమ‌లుకు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు మాన‌వ వ‌న‌రుల శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇందులో తొలి తీర్మానం మాల్స్ కు సంబంధించిన‌ది కాగా...రెండు, మూడో తీర్మానాలు రెస్టారెంట్, కేఫ్ ఔట్ లెట్స్, మార్కెట్ ఔట్ లెట్స్ గురించి ఉన్నాయి. అంటే ఇక నుంచి ఈ మూడు రంగాల్లో సౌదీయేష‌న్ నిబంధ‌న‌ల మేర‌కు కార్మికుల నిష్ప‌త్తిని ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గ‌తంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు మాల్స్ లో సౌదీయేష‌న్ శాతం మేర‌కు స్థానికుల‌కు ఉద్యోగాలు క‌ల్పించాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీలు, ఇత‌ర చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ నిర్ణ‌యంతో ఆయా రంగాల్లో సౌదీల‌కు 51వేల ఉద్యోగాలకు అవ‌కాశం ఏర్ప‌డుతుండ‌గా... ప్ర‌వాసీయుల‌కు మాత్రం  ఉపాధి అవ‌కాశాలు కుదించుకుపోయే ప్ర‌మాదం నెల‌కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com