ఫేస్ ఐడీతో ప్ర‌భుత్వ సేవ‌లు...ప్ర‌పంచంలోనే తొలిసారిగా యూఏఈలో అమ‌లు

- April 08, 2021 , by Maagulf
ఫేస్ ఐడీతో ప్ర‌భుత్వ సేవ‌లు...ప్ర‌పంచంలోనే తొలిసారిగా యూఏఈలో అమ‌లు

యూఏఈ: సాంకేతికంగా ప్ర‌పంచ దేశాల‌తో పోటీ ప‌డేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఒర‌వ‌డిని అడాప్ట్ చేసుకుంటున్న యూఏఈ ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌రో టెక్నాల‌జీని యూఏఈ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ప్ర‌భ‌త్వ కార్యాల‌యాల‌కు రాకుండా ప్ర‌జ‌లు ఇంటి నుంచే ప‌లు ద‌ర‌ఖాస్తులు, పాసులు, ఇత‌ర ప్ర‌భుత్వ సేవ‌లు పొందెందుకు వీలుగా బ‌యోమెట్రిక్, ఫింగ‌ర్ ప్రింట్స్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డులో ఐరిష్ విధానంతో దీన్ని పోల్చి చెప్ప‌వ‌చ్చు. ముందుగా అంద‌రి వివ‌రాల‌ను సేక‌రించి స‌ర్వ‌ర్ క్రోడిక‌రిస్తారు. ఎవ‌రైన ద‌ర‌ఖాస్తుదారుడు ఏదైన ప్ర‌భుత్వ సేవ‌లు పొందెందుకు అప్లికేష‌న్ పెట్టుకోవాలంటే అత‌ను వెబ్ కామ్ ముందు కూర్చుంటే స‌రిపోతుంది. బ‌యోమెట్రిక్ ఫేస్‌, ఫింగ‌ర్ ప్రింట్స్ రిక‌గ్నైజేష‌న్ తో అత‌ని వివ‌రాలు పూర్తిగా డిజిట‌ల్ ప‌రంగా న‌మోదవుతాయి. అత‌ని అప్లికేష‌న్ న‌మోదు చేయ‌బ‌డుతుంది. ప్ర‌పంచ దేశాల్లో ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్న‌తొలి దేశంగా యూఏఈ ఘ‌న‌త సాధించ‌టం విశేషం. ఇదిలాఉంటే యూఏఈలోని దుబాయ్ ప‌రిధిలో ఈ బ‌యోమెట్రిక్ ఫేస్ రిక‌గ్నైజేష‌న్ విధానం తొలిగా అమ‌లులోకి రానుంది. బ‌యోమెట్రిక్ ఫేస్ రిక‌గ్నైజేష‌న్ కు సంబంధించి  దుబాయ్ రూల‌ర్ ప్ర‌క‌ట‌న విడుదుల చేసిన రెండు నెల‌ల లోపే ఈ విధానం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావ‌టం మ‌రో విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com