'ఏజెంట్'గా అఖిల్!

\'ఏజెంట్\'గా అఖిల్!

హైదరాబాద్: అక్కినేని అఖిల్ బర్త్ డే కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ను ఇచ్చేశాడు. అతని ఐదో చిత్రానికి 'ఏజెంట్' అనే టైటిల్ కన్ ఫామ్ చేశారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త గెటప్ తో కనిపించబోతున్నాడు. బర్త్ డే సందర్బంగా ఆ నయా లుక్ ను విడుదల చేశారు. సురేందర్ రెడ్డికి తాను పూర్తిగా సరెండర్ అయిపోతున్నానంటూ అఖిల్ ప్రకటించడం విశేషం. వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మంతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి 'సురేందర్ 2 సినిమా' బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్ లో 'కిక్, రేసు గుర్రం' వంటి సూపర్ హిట్స్ రావడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ పైన కూడా సూపర్ క్రేజ్ నెలకొంది. స్టార్ హీరోలను సూపర్ స్టైల్స్ గా తెర మీద చూపించడంలో సురేందర్ రెడ్డికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహేశ్ బాబును 'అతిథి'లో సరికొత్తగా ప్రెజెంట్ చేసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్ ను కూడా పూర్తి మేకోవర్ తో అభిమానుల ముందు పెట్టాడు.

పెరిగిన జుత్తు, రఫ్ గడ్డం, చేతిలో సిగరెట్ తో అఖిల్ ఫుల్ యాటిట్యూడ్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించడం విశేషం. ఈ స్పై థ్రిల్లర్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుండి మొదలు కానుంది. విశేషం ఏమంటే... సినిమా షూటింగ్ మొదలు కాకముందే... దీని రిలీజ్ డేట్ ను ప్రొడ్యూసర్స్ లాక్ చేశారు. ఈ యేడాది డిసెంబర్ 24న తమ 'ఏజెంట్' జనం ముందుకు వస్తాడని ప్రకటించారు. సో... ఈ యేడాది అక్కినేని అఖిల్ రెండు సినిమాలతో తన అభిమానులను అలరించబోతున్నాడు. అతని లేటెస్ట్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' జూన్ 19న వస్తుండగా, ఇప్పుడీ సినిమా రెండో ద్వితీయార్థం చివరిలో రాబోతోందన్నమాట! సో... అక్కినేని అభిమానులకు ఇది డబుల్ ధమాకా!!

Back to Top