బిచ్చగాళ్ళపై పోలీసుల ఉక్కుపాదం
- April 09, 2021
దుబాయ్: దుబాయ్ పోలీస్, యాంటీ బెగ్గింగ్ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో బిచ్చగాళ్ళు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బిచ్చగాళ్ళను పౌరులు, నివాసితులెవరూ ప్రోత్సహించకుండా తగు చర్యలు చేపడుతున్నారు. గడచిన మూడేళ్ళలో 842 మంది బిచ్చగాళ్ళను (వివిధ దేశాలకు చెందినవారిని) అరెస్ట్ చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లోనూ, వీధుల్లోనూ బిచ్చమెత్తుకునేవారిని ఉపేక్షించే సమస్యే లేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నిందితులపై కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. బిచ్చగాళ్ళకు దానం చేయడం కంటే, స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వాలనీ, తద్వారా అసలైన పేదలకు వారి దానం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 901 ద్వారా బిచ్చగాళ్ళ విషయమై ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







