తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.నిన్నటి వరకు 2 వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 3 వేలకు చేరువలో నమోదయ్యాయి.తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది.ఇందులో 3,04,548 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,791 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1752కి చేరింది.కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 584 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 11,495 మంది ఐసోలేషన్ ఉన్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







