హైదరాబాద్‌లో నాలుగు కొత్త కోవిడ్ కేంద్రాలు
- April 10, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నాలుగు కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.ఇందుకోసం రూ.1.79 కోట్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన నిధులను ఈ అవసరాల కోసం ఖర్చు చేసేలా.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేంద్రాలు నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్‌లోని నిజామియా టిబ్బి ఆసుపత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రులను కరోనా కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే రూ.1.79 కోట్లను తక్షణం పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ, బయో వ్యర్థాల నిర్వహణ, కరోనా పేషెంట్ల ఆహారపు అవసరాలకు ఖర్చు చేయాలని రిజ్వి స్పష్టం చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







