ఒమ‌న్ ప్రణాళిక

- April 11, 2021 , by Maagulf
ఒమ‌న్ ప్రణాళిక

ఒమ‌న్: 2021 ఆగస్టు చివరి నాటికి సుమారు 3 మిలియన్ల డోసుల‌ కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించాలని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు ఒమ‌న్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.  ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్రోగ్రామ్ ను ముమ్మ‌రం చేసిన ఒమ‌న్ ఈ ఏడాది చివ‌రి నాటికి ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌నే ల‌క్ష్యంతో ఉంది.

జాతీయ రోగనిరోధకత ప్రణాళికలో భాగంగా 3.2 మిలియన్ల మందికి టీకాలు అందించ‌గ‌లిగితే జనాభాలో 70% వ‌ర‌కు వ్యాక్సిన్ అందుతుంద‌ని వెల్ల‌డించింది. అయితే..ఇందులో 18 ఏళ్ల‌కు త‌క్కువ ఉన్న వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇదిలాఉంటే ఇప్పటికే కోవిడ్ బారిన ప‌డిన‌వారికి ప్ర‌స్తుతానికి ఒక‌టే డోసు అందించ‌నున్న‌ట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com