తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 12, 2021
హైదరాబాద్: తెలంగాణ కరోనా సెకండ్‌వేవ్‌లో కొత్త పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఆరుగురు కరోనాతో మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 565 మంది కరోనాబారినపడి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529కు చేరగా.. రికవరీ కేసులు 3,05,900కు పెరిగాయి.ఇప్పటి వరకు కరోనాతో 1765 మంది ప్రాణాలు వదిలారు.. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉందని.. అదే దేశవ్యాప్తంగా అయితే 89.9 శాతంగా ఉంది.. ఇక, యాక్టివ్ కేసులు 21,864గా ఉండగా.. అందులో హోం ఐసోలేషన్‌లోనే 14,431 మంది ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్‌లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









