ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా సుశీల్‌ చంద్ర!

- April 12, 2021 , by Maagulf
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా సుశీల్‌ చంద్ర!

న్యూ ఢిల్లీ: భారత్ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియామకం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి ప్రస్తుతం సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత సీఈసీ సునీల్‌ అరోడా పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది. ఆయన స్థానంలో సుశీల్‌ ఈ నెల 13న పదవీ బాధ్యతలు చేపడతారు. వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆయన కొనసాగుతారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com