అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- January 24, 2026
అమెరికా: అమెరికాలోని జార్జియాలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులో అనుమానితుడైన విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది.
మృతులను మీము డోగ్రా(43), గౌరవ్ కుమార్(33), నిధి చందర్(37), హరీశ్ చందర్(38)గా గుర్తించారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని, వారు ఒక గదిలో దాక్కున్నారని తెలిపింది. వాళ్లలో ఒకరు పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లే సరికి నలుగు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించాయి.
ఈ ఘటన పై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని కూడా కాన్సులేట్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని జార్జియా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల నేపథ్యం, అనుమానితుడి ఉద్దేశాలు వంటి అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







