కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 350 మందిపై కేసులు

- April 12, 2021 , by Maagulf
కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన: 350 మందిపై కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునే దిశగా తనిఖీల్ని మరింత ముమ్మరం చేశారు. తాజాగా 369 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 216 మంది ఫేస్ మాస్కులు ధరించలేదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించడానికి సంబంధించి 13 మందిపై కేసులు బుక్ చేయడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినవారు కాకపోతే, ఓ వాహనంలో డ్రైవర్ సహా నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు కరోనా నేపథ్యంలో. కాగా, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించని 138 మందిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లోడ్ చేసుకోనందుకుగాను ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటిదాకా వేలాదిమందిపై ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పాటించాలనీ, పాటించనివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com