'మేజర్' టీజర్ విడుదల...
- April 12, 2021
హైదరాబాద్: 2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది 'మేజర్' చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా... ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ చిత్రంలో చూపిస్తుండటం విశేషం. ముంబై 26/11 ఎపిసోడ్ ను అత్యంత ఉత్కంఠభరితంగా, రోమాంచితంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు దర్శకుడు శశి కిరణ్ తిక్క. సోనీ పిక్చర్స్ తో పాటు మహేశ్ బాబు కు చెందిన జిఎంబి సంస్థ, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా 'మేజర్' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను మేజర్ ఉన్నికృష్ణన్ మాతృభాషైన మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఈ టీజర్ ను తెలుగులో మహేశ్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు.
ఏప్రిల్ 12న విడుదలైన 1.34 నిమిషాల 'మేజర్' టీజర్ ను చూడగానే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. తాజ్ ప్యాలెస్ పై జరిగిన దాడిలో ఓ పక్క ప్రాణాలు కోల్పోతూ కూడా సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా ఉగ్రవాదులకు సింహస్వప్నంగా నిలిచాడనేది ఛాయామాత్రంగా ఇందులో చూపించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్, రేవతి, శోభిత దూళిపాల, సాయి మంజ్రేకర్, మురళీశర్మ కూడా ఈ టీజర్ లో కనిపిస్తారు. దేశభక్తి అంటే ఏమిటో చెప్పిన విధానం బాగుంది. 'దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్ళను కాపాడుకోవడం సోల్జర్ పని' అంటూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర ద్వారా చెప్పించడం అద్భుతం. సరిహద్దుల్లో శత్రు దేశ సైనికులతో యుద్ధం చేయడమే కాదు, దేశం లోపలకు వచ్చేసిన టెర్రిస్టులను అరికట్టడం కోసం కూడా మన సోల్జర్స్ ప్రాణాలు అర్పించాల్సి రావడం బాధాకరం. ఈ అంశాలపై గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... 'మేజర్' వాటికి భిన్నమైన చిత్రం అని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 'మేజర్' జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. కానీ ఈ టీజర్ లో ఎక్కడా విడుదల తేదీని మాత్రం ప్రస్తావించలేదు!
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







