తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు ఉగాది వేడుక: ఏపీ గవర్నర్

- April 12, 2021 , by Maagulf
తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు ఉగాది వేడుక: ఏపీ గవర్నర్

అమరావతి: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో 'శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది' శాంతి, సామరస్యం, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ ఈ సంతోషకరమైన పండుగ శుభవేళ  ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. సాధారణంగా నూతన సంవత్సరం ప్రజలకు తమ ఉజ్వల భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింప చేస్తుందని, ఈ క్రమంలో ప్రతి ఇంటా శుభం కలగాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. కరోనా విపత్కర పరిస్దితులలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను జరుపు కోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేసారు. సామాజిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును తప్పని సరిగా ధరించడం, శానిటైజర్‌ను ఉపయోగిస్తూ  తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనా నుండి విముక్తి పొందగలుగుతామని గవర్నర్ హరిచందన్ వివరించారు. కరోనా టీకా సురక్షితమన్న విషయం ఇప్పటికే స్పష్టం అయినందున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని, తద్వారా కరోనా  గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామని గవర్నర్ స్పష్టం చేసారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com