కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
- April 12, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సూచనలు, సలహాలు అందించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తన ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజలకు సహాయం అందించడానికే ఈ ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్లు కవిత తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు.

ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. కరోనా సంబంధిత సహాయ, సూచనలకు ఎవరైనా ఫోన్ నెంబర్లు 040-23599999 / 8985699999 (హైదరాబాద్), 08462- 250666 (నిజామాబాద్ కార్యాలయం)లో సంప్రదించవచ్చని సూచించారు. తన బృందం 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఆ ట్వీట్లో కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







