ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- April 12, 2021
అమరావతి : శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు కలగాలి.రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలి.మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు వారికి..మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!







