కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం

- April 12, 2021 , by Maagulf
కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం

భారత్ లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉధృతి కట్టడికోసం పలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి రానున్నదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి నివారణ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా గతఏడాది కేంద్రం.. దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలపై పలు ఆంక్షలు విధించింది. తరువాత దశలవారీగా విమాన సేవలను పునరుద్ధిరించింది. అయితే ఆ సమయంలో దేశీయ విమానాల్లో భోజన సేవలకు అనుమతులు ఇవ్వలేదు.. ఇక గత ఏడాది ఆగష్టు 31 తరువాత కొన్ని షరత్తులతో కూడిన అనుమతులను ఇచ్చింది. భోజన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.

తాజాగా మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ సమీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా పలు చర్యలు చేపట్టింది. రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఇక నుంచి భోజన సేవలపై నిషేధం విధించింది. దేశీయంగా రెండు గంటలకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే ఇక నుంచి భోజన సదుపాయాలు ఉంటాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com