సివిల్ ఐడీ కార్డుల జారీ స‌మ‌యాన్ని ప్ర‌క‌టించిన పీఏసీఐ

- April 14, 2021 , by Maagulf
సివిల్ ఐడీ కార్డుల జారీ స‌మ‌యాన్ని ప్ర‌క‌టించిన పీఏసీఐ

కువైట్ సిటీ: ర‌మ‌దాన్ మాసం పురస్క‌రించుకొని అధికారిక ప‌ని గంట‌ల‌ను ప్ర‌క‌టించిన కువైట్...సివిల్ ఐడీ కార్డుల జారీకి సంబంధించి కూడా స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఈ మేర‌కు సివిల్ ఐడి కార్డులను సేకరించే సమయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) ప్రకటించింది. సౌత్ సుర్రాలోని ప్రధాన కార్యాలయంలో  ఉదయం 10 నుండి సాయంత్రం 4:30 వరకు ఐడీ కార్డుల‌ను పొంద‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే. జహ్రా, అహ్మదీ శాఖలలో మాత్రం మధ్యాహ్నం 1:30 గంటల వ‌ర‌కే సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ఇదిలాఉంటే ప‌రిపాల‌నా నిర్వ‌హ‌ణ భ‌వ‌నంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప‌ని చేస్తాయి.  ఇక  పౌరుల రిసెప్షన్ హాల్ లో  మధ్యాహ్నం ఒంటి గంటకు విధులు ముగుస్తాయి.  ప్రవాసులు మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శించేందుకు అనుమ‌తిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com