'ఆరాట్టు' టీజర్: తెలుగు డైలాగ్ తో అదరగొట్టిన మలయాళ స్టార్...
- April 14, 2021మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్ టీజర్ తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉండగా... అది కూడా తెలుగు డైలాగ్ కావడం విశేషం. టీజర్లో 'నేను వాడిని చంపేస్తాను' అంటూ విలన్ ను హెచ్చరించారు మోహన్ లాల్. దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్ పాత్ర ఉండి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'ఆరాట్టు' చిత్రానికి బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. మీరు కూడా ఈ పైసా వసూల్ టీజర్ ను వీక్షించండి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు