'దృశ్యం-2' షూటింగ్ పూర్తి
- April 15, 2021
హైదరాబాద్: బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ 'దృశ్యం' చిత్రానికి సీక్వెల్ గా 'దృశ్యం-2' తెరకెక్కుతోంది.మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న 'దృశ్యం-2' నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్.చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది.ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పిక్ ను విడుదల చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మలయాళంలో తెరకెక్కిన 'దృశ్యం' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.దీంతో ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు.అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. 'దృశ్యం, దృశ్యం-2' మలయాళంలో మోహన్ లాల్ నటించగా తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు.ఇక తెలుగులో 'దృశ్యం' చిత్రానికి ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అయితే 'దృశ్యం-2' తెలుగు రీమేక్ కు మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే 'దృశ్యం-2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









