'బోర్డర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల!
- April 15, 2021చెన్నై: సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే... రామ్ చరణ్ 'బ్రూస్లీ', ప్రభాస్ 'సాహో' చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ చేరువయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి 'బోర్డర్' అనే పేరు ఖరారు చేశారు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సామ్ సి.ఎస్. స్వరాలు అందిస్తున్న 'బోర్డర్'లో రెజీనా కసండ్రా, స్టెఫీ పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే చివరి వారంలో విడుదల చేస్తామని నిర్మాత విజయ్ రాఘవేంద్ర చెబుతున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..