హెచ్ఆర్ డొమైన్: కాన్సులర్ సంబంధిత వ్యవహారాలకోసం ఒమనీయులకే అనుమతి

- April 15, 2021 , by Maagulf
హెచ్ఆర్ డొమైన్: కాన్సులర్ సంబంధిత వ్యవహారాలకోసం ఒమనీయులకే అనుమతి

మస్కట్: కాన్సులర్ సంబంధిత వ్యవహారాల్లో వలస సిబ్బందికి అస్సలేమాత్రం అవకాశం లేకుండా, కేవలం ఒమన్ పౌరులకు మాత్రమే అవకాశం కల్పించేలా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. తమ వ్యక్తిగత సేవల నిమిత్తం డాక్యమెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే కాన్సులర్ విషయాలపై వలసదారులకు అవకాశం వుంటుంది. ఒమన్ పౌరులు లేదా కార్పరొేట్ సర్వీసులకు కాన్సులేట్ డిపార్టుమెంట్ వద్ద వలసదారులకు అవకాశమే వుండదని సర్క్యులర్ చెబుతోంది. చాలా కంపెనీలు హెచ్ఆర్ డిపార్టుమెంటులో ఒమనీ సిబ్బంది అలాగే వలసదారుడైన సిబ్బంది కలిగి వుండడం సహజంగా జరుగుతోంది. తాజా నిర్ణయంతో ఈ పోస్టులు పూర్తిగా ఒమనీయులకే ఇకపై కేటాయించబడతాయి. చాలాకాలంగా హెచ్ ఆర్ డిపార్టుమెంటులో (ఓ ఆటోమోటివ్ డీలర్ కంపెనీ) పనిచేస్తున్న సుందర్ కుమార్, ఇకపై ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయన్నది తనకు అర్త: కావడంలేదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com