కరోనా పేషెంట్ల కోసం బెడ్స్ సిద్ధం చేయాలి: సోమేశ్ కుమార్

- April 15, 2021 , by Maagulf
కరోనా పేషెంట్ల కోసం బెడ్స్ సిద్ధం చేయాలి: సోమేశ్ కుమార్

హైదరాబాద్: తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్లకు అదనంగా, 25 శాతం పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లను పోస్ట్ పోన్ చెయ్యాలని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్స్ కరోనా కోసం పెంచాలని నిర్ణయం తీసుకుంది.కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ కూడా సిద్ధం చేసింది.కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు.మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,307 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది.ఇందులో 3,08,396 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,788కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com