క్రిటిక‌ల్ కోవిడ్ కేసుల్లో వ్యాక్సిన్ తీసుకోని ప్ర‌వాసీయులే ఎక్కువ

- April 18, 2021 , by Maagulf
క్రిటిక‌ల్ కోవిడ్ కేసుల్లో వ్యాక్సిన్ తీసుకోని ప్ర‌వాసీయులే ఎక్కువ

కువైట్ సిటీ: కోవిడ్ బారిన ప‌డి ప‌రిస్థితి క్రిటిక‌ల్ గా ఉన్న వారిలో ఎక్కువ మంది ప్ర‌వాసీయులే ఉంటున్నార‌ని కువైట్ ప్ర‌క‌టించింది. వాళ్లంద‌రూ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని కోవిడ్ నియంత్ర‌ణ కోసం ఏర్పాటైన కువైట్ సుప్రీం అడ్వైజ‌రీ క‌మిటీ చైర్మ‌న్ వెల్ల‌డించారు. ఆస్ప‌త్రి పాల‌వుతున్న ప్ర‌వాసీయులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ప్ర‌స్తుతం నెల‌కొంటున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించైనా కువైట్లోని ప్ర‌జ‌లు అంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. మెజారిటీ ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ ను విజ‌య‌వంతంగా అడ్డుకోవ‌చ్చ‌న్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com