గాలి ద్వారా కరోనా వైరస్ వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోంది: ఎయిమ్స్

- April 18, 2021 , by Maagulf
గాలి ద్వారా కరోనా వైరస్ వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోంది: ఎయిమ్స్

న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. ఏకంగా 1501 మంది మృతిచెందారు. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 47లక్షల 88లక్షల 109కు చేరింది. ఇక రికవరీ రేటు 87.23శాతానికి తగ్గింది.కాగా గాలి ద్వారా కరోనా వాప్తి చాలా ఆందోళన కలిగిస్తోందని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా తెలిపారు.దీంతో కరోనా బారి నుంచి రక్షణ పొందాలంటే ఎన్95 మాస్క్ ధరించాలని సూచించారు. మిగిలిన మాస్కులు అయితే రెండు పెట్టుకోవాలన్నారు. వైరస్ రూపాంతరం మార్చుకోవడం వల్లే కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ఇక టీకా పంపిణీల్లో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే అత్యంత వేగంగా 12కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 12కోట్ల టీకా డోసుల లక్ష్యం చేరుకోవడానికి అమెరికాలో 97 రోజులు పట్టింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com