రంగంలోకి దిగనున్న ఇండియన్ ఆర్మీ
- April 20, 2021
న్యూ ఢిల్లీ: చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి.అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది.భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి.వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇక మనదేశంలో ప్రతి రోజూ 3 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది కేంద్రం.అంతే కాదు లాక్ డౌన్ మాత్రం పెట్టే ఆలోచన లేదని చెప్తోంది కేంద్రం. ఇక కరోనా కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపనున్న కేంద్రం.ఈ మేరకు ఆర్మీ చీఫ్ నర్వానేతో ఫోన్ లో మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆర్మీ బలగాలను దింపనుంది కేంద్రం.కరోనాను లెక్క చేయకుండా కొందరు ఆకతాయిలు మాస్కులు లేక తిరగడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి వారి ఆట కట్టించేందుకు ఆర్మీ బలగాలను ఉపయోగించుకోనుంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







