తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు..

- April 20, 2021 , by Maagulf
తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది.అయినా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లోకర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.

క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com