భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..
- April 21, 2021
మహారాష్ట్ర: నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది.ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఆసుపత్రి వెలుపల ఉన్న పెద్ద ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది.దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు.నిఫుణులు గ్యాస్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి అంతా కోలాహల వాతావరణం నెలకొంది.
కాగా, ఈ హాస్పిటల్ లో కరోనా రోగులకు పెద్దఎత్తున చికిత్స అందిస్తున్నారు.అసలే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.

తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







