ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు విమానాల పునరుద్ధరణ లేదు
- April 21, 2021జెడ్డా: సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్, మే 17 నుంచి అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ జరగనున్న విషయాన్ని వెల్లడిస్తూ, ఫిబ్రవరిలో ఏవైతే దేశాలకు ట్రావెల్ బ్యాన్ నిషేధం విధించడం జరిగిదో, వాటికి విమానాల పునరుద్ధరణ నుంచి మినహాయింపునిచ్చినట్లు వెల్లడించింది. 20 దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, విమానాల పునరుద్ధరణ విషయానికొస్తే, అన్ని కరోనా నిబంధనలూ పాటిస్తూ, అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తారు. అర్జెంటీనా, యునైట్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేసియా, ఇండియా, జపాన్, ఐర్లాండ్, ఇటలీ, పాకిస్తాన్, బ్రెజిల్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, సౌత్ ఆఫ్రికా, స్వీడన్, స్విస్ కాన్ఫెడరేషన్, ఫ్రాన్స్, లెబనాన్ మరియు ఈజిప్టు దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమల్లో వుంది.
తాజా వార్తలు
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…