యశోద ఆస్పత్రికి కేసీఆర్‌

యశోద ఆస్పత్రికి కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్‌ యశోదా ఆస్పత్రికి రానున్నారు. చెస్ట్‌ సీటీ స్కాన్‌ కోసం ఆయన ఆస్పత్రికి వస్తారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లనున్నారు. 

కరోనా నిర్థారణ అయిన తర్వాత కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన సాగర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా  కరోనా సోకిన సంగతి విధితమే.

Back to Top