ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!
- April 22, 2021
దుబాయ్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కొరడా విసురుతోంది. రోజురోజుకీ పరిస్థితి చేతులు దాటిపోతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించింది యూఏఈ. ఈ నిర్ణయం ఏప్రిల్ 25 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రయాణ నిషేధం ఏప్రిల్ 24 శనివారం రాత్రి 11.59 నుండి అమల్లోకి వస్తుంది. 10 రోజుల తర్వాత జరిగే తదుపరి సమీక్ష లో నిషేధం పై నిర్ణయం తీసుకోనుంది కాబినెట్.
అలాగే, గడిచిన 14 రోజులలో భారతదేశం గుండా ప్రయాణించిన ట్రాన్సిట్ ప్రయాణీకులు కూడా యూఏఈ ప్రవేశానికి అనర్హులు.
యూఏఈ పౌరులు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మరియు అధికారిక ప్రతినిధుల పై ఈ నిషేధం వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది.
అయితే, యూఏఈ నుండి భారత్ కు మాత్రం విమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!







