ఏపీ కరోనా అప్డేట్
- April 22, 2021
అమరావతి: ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు పది వేలలు దాటిపోయాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 41,871 శాంపిల్స్ పరీక్షించగా 10,759 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 29 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి చిత్తూర్ లో ఐదుగురు,కృష్ణ లో ఐదుగురు,కర్నూల్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప మరియు విశాఖపట్నం లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.ఇదే సమయంలో 3,992 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 997462కు చేరగా.. యాక్టివ్ కేసులు 66944గా ఉన్నాయి.ఇక, ఇప్పటి వరకు 922977 కరోనా నుంచి కోలుకోగా 7541 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







