అమ‌ర్‌నాథ్ యాత్రకు కరోనా బ్రేక్

- April 22, 2021 , by Maagulf
అమ‌ర్‌నాథ్ యాత్రకు కరోనా బ్రేక్

న్యూ ఢిల్లీ: క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇప్పుడు ప‌విత్ర అమ‌ర్‌నాథ్ యాత్రను కూడా తాకింది.. అయితే, యాత్ర ప్రారంభం అయ్యేనాటికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం అయితే రిజిష్ట్రేష‌న్ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ విష‌యాన్ని అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) ప్ర‌క‌టించింది.దేశంలో క‌రోనా ప‌రిస్థితి దృష్ట్యా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే.. అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేశామ‌ని.. ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించి.. కోవిడ్ ప‌రిస్థితులు మెరుగుప‌డితే.. తిరిగి ప్రారంభించ‌డంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది.

కాగా, హిమాయాల్లోని అమ‌ర్‌నాథ్ యాత్రను చాలా ప‌విత్రంగా భావిస్తారు.. కానీ, ఆ గుహ‌కు చేరుకోవ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని.. భ‌క్తులు వెళ్లేందుకు ప్ర‌తి ఏటా గట్టి భ‌ద్ర‌త మ‌ధ్య‌ యాత్ర నిర్వ‌హిస్తూ ఉంటారు.. బాల్తాల్ మార్గంలో జూన్ 28న‌, చందన్వారీ మార్గంలో ఆగస్టు 22న ప్రారంభ‌మ‌య్యే ఈ యాత్ర కోసం ముందుగానే పేర్లు న‌మోదు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు.. కానీ, కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపివేసింది అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com