నిత్యానంద సంచలన ప్రకటన..భారతీయులపై నిషేధం!

నిత్యానంద సంచలన ప్రకటన..భారతీయులపై నిషేధం!

న్యూఢిల్లీ: కొవిడ్-19  కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వివాద‌స్ప‌ద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. తన దేశంగా ఆయన చెప్పుకుంటున్న ‘‘కైలాస’’ ద్వీపంలోకి భారత్ నుంచి వచ్చే భక్తులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. భారత్‌తో పాటు బ్రెజిల్, ఈయూ, మలేసియా నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధిస్తున్నట్టు తన ‘ప్రెసిడెన్షియల్ మేండేట్’లో నిత్యానంద పేర్కొన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కైలాస రాయబార కార్యాలయాలన్నిటికీ నేరుగా ‘ఎస్పీహెచ్’ ఇస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్..’’ అంటూ ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు.

కాగా ట్విటర్లో నిత్యానంద ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్’’ని చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. రకరకాల ఈమోజీలతో ఈ ప్రకటనను రీట్వీట్ చేస్తూ నవ్వుల టపాసులు పేలుస్తున్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద 2019  నుంచి ఈక్విడార్ తీరంలోని ఓ ద్వీపంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ‘కైలాస’ ద్వీపాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. 

Back to Top