భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు ఇవే..
- April 23, 2021
భారత దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరిగిపోయింది.భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.దీంతో భారత్ నుంచి తమ తమ దేశాలకు ప్రయాణికులు రాకుండా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి.కొన్ని దేశాలు అయితే ఇండియా నుంచి విమానాలను పూర్తిగా బ్యాన్ చేశాయి.
యూఏఈ, ఆస్ట్రేలియా, ఒమన్ దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి.భారత్ నుంచి విమానాలు ఈ దేశాలకు వెళ్లడంపై నిషేధం విధించారు.భారత్ నుంచి వచ్చే విమానాలపై కెనడా 30 రోజుల నిషేధం విధించింది.
ఇక భారత్‌ను యూకే రెడ్ లిస్ట్‌లో పెట్టింది.ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై యూకే నిషేధం విధించింది.గతంలో న్యూజిలాండ్ కూడా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఇజ్రాయెల్ దేశం తమ దేశస్థులను భారత్, ఉక్రెయిన్, ఇథియోపియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, మెక్సికో, టర్కీలకు వెళ్లకూడని హెచ్చరికలు చేసింది.అమెరికా కూడా తన పౌరులకు ఇలాంటి హెచ్చరికలే చేసింది.
ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా భారత్ నుంచి ప్రయాణికులు రాకుండా 2 వారాల పాటు ట్రావెల్ బ్యాన్ విధించింది.హాంగ్‌కాంగ్ మన దేశం నుంచి వచ్చే విమానాలపై మే 3వ తేదీ వరకు నిషేధం విధించగా సింగపూర్ లో ప్రయాణికులను 14 రోజుల వరకు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్‌కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









