కోవిడ్ రూల్స్ బ్రేక్‌... 2 రెస్టారెంట్లు, ఓ బార్బ‌ర్ షాప్ క్లోజ్‌

కోవిడ్ రూల్స్ బ్రేక్‌... 2 రెస్టారెంట్లు, ఓ బార్బ‌ర్ షాప్ క్లోజ్‌

అజ్మన్: కరోనా వైర‌స్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో అర్ధంగాక ప్ర‌భుత్వాలు, అధికారులు త‌ల‌లు బాదుకుంటుంటే...కొంద‌రిలో మాత్రం ఆ సోయే లేకుండా పోతోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బార్బ‌ర్ సెలూన్ వంటి సెక్టార్ల‌లో ఉండే వారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కానీ, అజ్మ‌న్ ప‌రిధిలోని రెండు రెస్టారెంట్లు, ఓ బార్బ‌ర్ సెలూన్‌లో మాత్రం నిర్వాహ‌కులు కోవిడ్ రూల్స్ క‌నీసం పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను కూడా పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. అజ్మ‌న్ పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు, విప‌త్తు నిర్వ‌హ‌ణ స్థానిక అధికారులు సంయుక్తంగా చేప‌ట్టిన త‌నిఖీల్లో ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. 2 రెస్టారెంట్లు, బార్బ‌ర్ షాపులోని సిబ్బంది మాస్కులు లేకుండా, చేతికి గ్లౌజులు వేసుకోకుండా, నెత్తికి హెడ్ క‌విరింగ్స్ వేసుకోకుండానే రెస్టారెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు..వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైనా ఇప్ప‌టికీ వ్యాక్సిన్ తీసుకోలేదు. పైగా ప్ర‌తి వారం పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉన్నా..అదీ కూడా చేయ‌లేదు. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ కోవిడ్ రూల్స్ బ్రేక్ చేయ‌టంతో 2 రెస్టారెంట్ల‌తో పాటు బార్బ‌ర్ షాప్ ను మూసివేస్తున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. 

 

Back to Top