షార్జా లో 113 మంది ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు చెల్లింపు

- March 03, 2016 , by Maagulf
షార్జా లో 113 మంది  ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు చెల్లింపు

 షార్జా లో 113 మంది  ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు  నష్ట పరిహారం కింద చెల్లించనున్నట్లు షార్జా పాలకుడు  సుప్రీం కౌన్సిల్ సభ్యుడు  గౌరవనీయ  డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమ మంగళవారం ఆమోదించారు.  ఎమిరేట్ లో స్థల దాతలు ఇచ్చిన ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఫైనాన్స్ విభాగం చైర్మన్ వాలీడ్ అల్ శయెఘ్ షార్జా రేడియో ఒక రేడియో కాల్ -ఇన్ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ షార్జ ప్రభుత్వం ఆర్థిక కట్టుబాట్లు ఎడుర్కొం టున్నప్పటికి , షార్జా పాలకుడు 113 ఆస్తి యజమానులకు చెల్లించాల్సిన నష్ట పరిహారంకె అధిక  ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా  చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. ఆర్థిక శాఖ వచ్చే వారం ఈ చెల్లింపులను సంబంధించిన యజమానులకు  అందచేస్తుందని  అల్ శయెఘ్ సమాచారం ఇచ్చారు .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com