విమాన ప్రయాణాలకు 'తవకల్న' యాప్ తప్పనిసరి...
- April 24, 2021
సౌదీ: కోవిడ్ తీవ్రత నేపథ్యంలో విమాన ప్రయాణికులకు లేటెస్ట్ గా మార్గనిర్దేశాలను జారీ చేసింది సౌదీ. ఇక నుంచి సౌదీలో బోర్డింగ్ అయ్యే విమాన ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా తవకల్న్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని జనరల్ అథారిటీ అఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సౌదీలోని అన్ని జాతీయ విమానయాన సంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తవకల్న్ యాప్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలని సూచించారు. అలాగే తమ వద్ద విమాన షెడ్యూల్ వివరాలు, ప్రయాణికుల వివరాలను తవకల్న్ యాప్ తో అనుసంధానం చేయాలని కూడా స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వం సూచించిన మేర ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి లేనది యాప్ ద్వారా తెలిస్తే వెంటనే వారి ప్రయాణాన్ని రద్దు చేస్తూ ఎస్ఎంఎస్ పంపాలని వెల్లడించింది. కంప్యూటర్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ విధానం వర్తిస్తుంది. ఇదిలాఉంటే విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యలు కొనసాగుతాయని, 250 మంది పర్యవేక్షకులు ఎల్లవేళలా నిబంధనలను అమలు తీరును పరిశీలిస్తూ ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారని వివరించారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







