విమాన ప్ర‌యాణాల‌కు 'త‌వ‌క‌ల్న' యాప్ త‌ప్ప‌నిస‌రి...

- April 24, 2021 , by Maagulf
విమాన ప్ర‌యాణాల‌కు \'త‌వ‌క‌ల్న\' యాప్ త‌ప్ప‌నిస‌రి...

సౌదీ: కోవిడ్ తీవ్ర‌త నేప‌థ్యంలో విమాన ప్ర‌యాణికుల‌కు లేటెస్ట్ గా మార్గ‌నిర్దేశాలను జారీ చేసింది సౌదీ. ఇక నుంచి సౌదీలో బోర్డింగ్ అయ్యే విమాన ప్ర‌యాణికులు అంద‌రూ ఖ‌చ్చితంగా త‌వ‌క‌ల్న్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల‌ని జ‌న‌ర‌ల్ అథారిటీ అఫ్ సివిల్ ఏవియేష‌న్ అధికారులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు సౌదీలోని అన్ని జాతీయ విమానయాన సంస్థ‌ల‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. త‌వ‌క‌ల్న్ యాప్ ఉన్న వారిని మాత్ర‌మే ప్ర‌యాణానికి అనుమ‌తించాల‌ని సూచించారు. అలాగే త‌మ వద్ద విమాన షెడ్యూల్ వివ‌రాలు, ప్ర‌యాణికుల వివ‌రాల‌ను త‌వ‌క‌ల్న్ యాప్ తో అనుసంధానం చేయాల‌ని కూడా స్ప‌ష్టం చేశారు. సౌదీ ప్ర‌భుత్వం సూచించిన మేర ప్ర‌యాణికుల ఆరోగ్య ప‌రిస్థితి లేన‌ది యాప్ ద్వారా తెలిస్తే వెంట‌నే వారి ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేస్తూ ఎస్ఎంఎస్ పంపాల‌ని వెల్ల‌డించింది. కంప్యూట‌ర్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ విధానం వ‌ర్తిస్తుంది. ఇదిలాఉంటే విమానాశ్ర‌యంలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లు కొన‌సాగుతాయ‌ని, 250 మంది ప‌ర్య‌వేక్ష‌కులు ఎల్ల‌వేళ‌లా నిబంధ‌న‌ల‌ను అమ‌లు తీరును ప‌రిశీలిస్తూ ఉల్లంఘ‌నుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వివ‌రించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com