భార‌త్ నుంచి విమానాల రాక‌ను ర‌ద్దు చేసిన‌ కువైట్‌

- April 24, 2021 , by Maagulf
భార‌త్ నుంచి విమానాల రాక‌ను ర‌ద్దు చేసిన‌ కువైట్‌

కువైట్ సిటీ: భార‌త్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి పెర‌గ‌టంతో గ‌ల్ఫ్ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కువైట్ ఏకంగా భార‌త్ నుంచి అన్ని క‌మ‌ర్శియ‌ల్ విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కువైట్ మంత్రిమండ‌లి తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఏప్రిల్ 24 శ‌నివారం నుంచే విమానాల ర‌ద్దు అమ‌లులోకి రానుంది.  భార‌త్ నుంచి ఇత‌ర దేశాల మీదుగా కువైట్ వ‌చ్చే ప్ర‌యాణికులు..ఆయా దేశాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న త‌ర్వాతే దేశంలోకి అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించింది. అయితే..కువైట్ పౌరులు, వారి ర‌క్త సంబంధీకులు, డొమ‌స్టిక్ వ‌ర్క‌ర్ల‌కు ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. ఇదిలాఉంటే క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌పై నిషేధం ఉన్నా...కార్గో విమానాల‌పై మాత్రం ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వి..అవి యధావిధిగా కొన‌సాగుతాయ‌ని కూడా స్ప‌ష్ట‌టం చేసింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com