భార‌త్ నుంచి బ‌హ్రెయిన్ వ‌చ్చే ప్ర‌యాణిల‌కు కొత్త సూచ‌న‌లు

- April 24, 2021 , by Maagulf
భార‌త్ నుంచి బ‌హ్రెయిన్ వ‌చ్చే ప్ర‌యాణిల‌కు కొత్త సూచ‌న‌లు

బ‌హ్రెయిన్: భార‌త్ లో కోవిడ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో గ‌ల్ఫ్ దేశాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు సంబంధించి కొత్త మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే..భార‌త్ పై ట్రావెల్ బ్యాన్ విధిస్తుండ‌గా..ఇంకొన్ని దేశాలు కొన్ని జాగ్ర‌త్త‌ల‌తో ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి ఇస్తున్నాయి. లేటెస్ట్ బ‌హ్రెయిన్ కూడా భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చే వారికి కొత్త సూచ‌న‌లు చేసింది. బ‌హ్రెయిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు మీదుగా దేశంలోకి వ‌చ్చే వాళ్లంతా ఖ‌చ్చితంగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ నెగ‌టీవ్ రిపోర్ట్ కాపీని వెంట తెచ్చుకోవాల‌ని సూచించింది. క్యూఆర్ కోడ్ ఉన్న రిపోర్ట్ ను మాత్రమే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. బ‌హ్రెయిన్ చేరుకునే 48 గంట‌ల లోపు తీసుకున్న శాంపుల్ ఇచ్చిన రిపోర్టుల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. 


--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బ‌హ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com