ఏపీ నైట్ కర్ఫ్యూ..మార్గదర్శకాల జారీ

- April 24, 2021 , by Maagulf
ఏపీ నైట్ కర్ఫ్యూ..మార్గదర్శకాల జారీ

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 
* అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు , రెస్టారంట్లు, హోటళ్లు మూసివుంచాలి.
* ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించేవి కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి.
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ  సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
* నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా  సేవలకూ కర్ఫ్యూ నిబంధనలు వర్తించవు.
* అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు.
*  ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది.
* కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
* రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూతో పాటు నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com