భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన పాక్...
- April 25, 2021
భారత్-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.అయితే, కరోనా కాలంలో పాక్ కు ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంగతితెలిసిందే . కాగా ఇప్పుడు ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతంగా ఉన్నది.దీంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాక్ ముందుకు వచ్చింది.వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందిస్తామని పాక్ పేర్కొన్నది.ఈ విషయాన్నీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.రెండు దేశాల అధికారులు ఈ విషయంలో చొరవ చూపించాలని, గొడవలు పక్కన పెట్టి మానవతావాదంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







