డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్ల ఎదుట భారీ క్యూలు
- April 25, 2021
దోహా: ఖతార్‌లోని లుసైల్, అల్ వక్ర లో ఏర్పాటు చేసిన డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్లకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,10,000 మంది డ్రైవ్ త్రూ సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. అయితే..జనం ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వేయిటింగ్ టైం కూడా పెరుగుతోందని, కొన్నిసార్లు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే వారు కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా వేయిటింగ్ సమయాన్ని విసుగు లేకుండా గడపొచ్చని టిప్స్ సూచించింది. అయితే..డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రస్తుతం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నవారు 21 రోజుల తర్వాత....మోడెనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మొదటి డోస్ తీసకున్న 28 రోజుల తర్వాత డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా తీసుకొచ్చు. రమదాన్ మాసం కావటంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యరాత్రి వరకు డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. అయితే..రాత్రి 11 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో జనం వస్తున్నారని తెలిపింది. ఆ సమయాల్లో వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే వారు డ్రింక్స్, స్నాక్స్ వెంట తెచ్చుకుంటే మంచిదని, అలాగే తమ వెంట పిల్లలను తీసుకురాకపోవటం మేలని తెలిపింది. గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది కనుక వాహనంలో సరిపడా ఇంధనం ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!