అంబులెన్స్ సర్వీసుల కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్
- April 25, 2021
హైదరాబాద్: రోజు గడిస్తే వేల సంఖ్యలో కరోనా బాధితులు పెరుగుతున్నారు.బెడ్స్ నిండుకుంటున్నాయి. ఆక్సిజన్ సరిపోడం లేదు.అఖరికి రోగులను తీసుకువచ్చే అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉండడం లేదు. అంబులెన్స్ వాహనాలు క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నాయి. అయితే అంబులెన్స్‌ల కొరతను తీర్చేందుకే సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కరోనా వేళ అంబులెన్స్‌ల కొరత వేధిస్తోంది.అయితే హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 8 అంబులెన్స్ లను పోలీస్ కమిషనర్ ఆడిషినల్ డీజీపీ సజ్జనార్ ప్రారంభించారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో ఈ అంబులెన్స్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డయాలసిస్ పేషెంట్లు, కరోనా పేషెంట్లు, గర్భిణిలు, వృద్ధులు ఈ సర్వీస్‌లను వినియోగించుకోవచ్చని సీపీ సజ్జనార్ తెలిపారు. అవసరమైన వాళ్లు 9490617440, లేదా 9490617431 నంబర్లను సంప్రదించాలన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారి పర్యవేక్షించనున్నారు.
ఈ అంబులెన్స్‌లను ప్రైవేట్ అంబులెన్స్‌లకు ధీటుగా ఏర్పాటు చేశారు.ఆక్సిజన్, అత్యవసర మందుల కోసం ప్రత్యేక విభాగాన్ని తయారు చేశారు. 24 గంటలపాటు అంబులెన్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్‌లను రోగులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీజపీ కోరారు. నగరంలో కరోనా సమయంలో ఎక్కువ డబ్బులు చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..