ఊహించని మేకోవర్ తో కార్తీ ఇంట్రెస్టింగ్ సినిమా.!
- April 25, 2021
కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీ సినిమాకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. సూర్య తర్వాత కార్తీ సినిమాలు మన దగ్గర బాగానే చూస్తారు. మరి అందుకు తగ్గట్టుగానే కార్తీ కూడా ఎప్పటికప్పుడు వైవిధ్యభరిత సబ్జెక్టులను తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఈసారి రొటీన్ మసాలా డ్రామా “సుల్తాన్” తో వచ్చిన కార్తీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసాడు.
మరి ఈసారి మాత్రం పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తున్నట్టు అనిపిస్తుంది. దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో “సర్దార్” అనే సరికొత్త కథతో వస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఇప్పుడు విడుదల చేశారు. అయితే ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ఈ మోషన్ పోస్టర్ టీజర్ ప్రామిసింగ్ గా ఉంది.
దాని నుంచి రివీల్ చేస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కార్తీ కనిపించాడు. ఇలాంటి రోల్ లో ఇది వరకు కార్తీ కనిపించింది లేదు. దీనితో ఇది కాస్త కొంత కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగులో వస్తోంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!