సౌదీ నుంచి భారత్‌కు ఆక్సిజన్ సరఫరా
- April 26, 2021
సౌదీ: భారతదేశంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల ప్రాణాలను రక్షించే వాయువు యొక్క తీవ్రమైన కొరతను తొలగించడానికి సౌదీ అరేబియా ఆదివారం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భారత్‌కు రవాణా చేసింది.
ఈ నేపథ్యంలో గల్ఫ్,ఇతర దేశాలలోని భారతీయ దౌత్యవేత్తలు అవసరమైన ఆక్సిజన్‌ను కొనుగోలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.భారతీయ నౌక, వైమానిక దళాల ద్వారా ట్యాంకర్లను పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.భారత్‌లో ఆక్సిజన్ కొరత తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దిగుమతి సుంకాలు ఎత్తివేయడమే కాకుండా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించింది.దీంతో అదానీ గ్రూప్‌నకు చెందిన ఎంపీసీ అనే సంస్ధ గల్ఫ్ నుంచి ఆక్సిజన్‌తో పాటు.. దానిని నిల్వచేసే కంటైనర్లను కొనుగోలు చేస్తోంది. సౌదీలోని ధమామ్ నౌకాశ్రయం నుంచి గుజరాత్‌లోని ముంద్రాకు ఈ నెల 24న (శనివారం) 80 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన నౌక బయలుదేరింది. ఆక్సిజన్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంలో సౌదీ ప్రభుత్వం సహాయం చేసింది. ఈ విషయాన్ని భారతీయ రాయబారి డాక్టర్ అవుసాఫ్ సయీద్ ట్విటర్లో వెల్లడించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇలా ట్వీట్ చేశారు: “80 టన్నుల ద్రవ ఆక్సిజన్‌తో 4 ఐఎస్ఓ క్రయోజెనిక్ ట్యాంకుల మొదటి రవాణా ఇప్పుడు దమ్మామ్ (సౌదీ అరేబియాలోని ఓడరేవు) నుండి ముంద్రా (పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్ ఓడరేవు) కు వస్తోంది.”
సౌదీ నుంచి వచ్చే ఈ ఆక్సిజన్‌ను గుజరాత్‌లోని కచ్ జిల్లాలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసినట్లగా వెల్లడించారు.దుబాయ్, మస్కట్ నగరాల నుంచీ అవసరమైన ఆక్సిజన్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి, దుబాయ్, అబుధాబీలతో దాదాపు ఒప్పందాలు పూర్తి అయ్యాయి.త్వరలో భారతీయ విమానాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్ కంటైనర్లను సరఫరా చేయనున్నారు. సింగపూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు ఆక్సిజన్ కంటైనర్లను తరలించారు.టాటా గ్రూప్ కోసం జర్మనీ నుంచి 24 ఆక్సిజన్ రవాణా ట్యాంకర్లను కూడా భారత వైమానిక దళం తరలించింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం