గాంధీ భవన్ లో కాల్ సెంటర్ ఏర్పాటు
- April 26, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ సమయంలో..పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం..కోవిడ్ వ్యతిరేక పోరాటంలో మేం సైతం అంటోంది కాంగ్రెస్ పార్టీ.. కరోనా బాధితులకు అండగా..గాంధీ భవన్ లో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక, ఇవాళ జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కరోనా బాధితులకు అండగా ఉండి.. వారికి భరోసా ఇవ్వాలని, కరోనా బాధితులతో మనో ధైర్యం నింపేందుకు కృషి చేయాలని కోరారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో కరోనా బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.. 040-24601254 ఈ నెంబర్ ఏర్పాటు చేసిన పార్టీ.. కరోనా బాధితులు సహాయం కోసం కాల్ చేయవచ్చని వివరించారు నేతలు.. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో.. ప్రభుత్వాలు కనీసం ఆక్సిజన్ అందించడంలో కూడా విఫలం అయ్యాయని విమర్శించారు. నేను ముందుగానే కరోనా పరిస్థితులను వివరించినా...ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టిందని ఫైర్ అయ్యారు భట్టి.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







