ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ స్పెషల్ సేల్..
- April 26, 2021
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ స్పెషల్ బిగ్‌సేవింగ్ డేస్ ఆఫర్‌తో ముందుకొచ్చింది.ఈ ఆఫర్ మే 2న ప్రారంభమై 7వ తేదీన ముగియనున్నట్లు ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు ఒక రోజు ముందుగానే అంటే మే 1వ తేదీన ఈ ఆఫర్ అందుబటులోకి రానుంది.
స్మార్ట్ ఫక్షన్లు, టీవీలు, గృహోపకరణాలపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ముఖ్యంగా యాపిల్, వివో, శాంసంగ్, షియోమీ, ఆసుస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది.ఎలక్ట్రానిక్ ఉపకరనాలపై 80 శాతం వరకు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ 62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది.ఎఫ్ 41 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్) రూ.12,999కే లభించనుంది.
పోకో ఎక్స్3 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్)ని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐఫోన్ 11 రూ.44,999, ఆసుస్ రాగ్ ఫోన్ 3 రూ.41,999కు, ఐకూ 3 రూ.24,990కి లభించనున్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ ధర రూ.26,999గా నిర్ణయించింది ఫ్లిప్‌కార్ట్.ఈ ఆఫర్లన్నింటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.అంతేకాదు ఈఎంఐలకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!







