సవరింపబడ్డ '2016 బ్యాగేజ్' రూల్స్
- March 03, 2016
1998 బ్యాగేజ్ రూల్స్‌ని, భారత ప్రభుత్వం 2016 బ్యాగేజ్ రూల్స్‌తో రీప్లేస్ చేసింది. వివిధ కేటగిరీలకు సంబంధించి బ్యాగేజ్ రూల్స్‌ని సరళతరం చేయడంతోపాటు, స్లాబ్స్ని సవరించింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ ప్రయాణీకుడి డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్‌ని 45000 నుంచి 50000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంతో కస్టమ్స్ డ్యూటీ 1800 రూపాయల దాకా తగ్గనుంది. వయసు, మినిమమ్ పీరియడ్ ఆఫ్ స్టేపైనా రిస్ట్రిక్షన్స్‌ని తొలగించారు. 2 ఏళ్ళలలోపు పసిపిల్లలకు సంబంధించి డ్యూటీ ఫ్రీ ఉంటుంది. బంగారు ఆభరణాలు వంటి ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ కేటగిరీలోకి చెందని వాటి విషయంలో మాత్రం, మినిమమ్ పీరియడ్ ఫర్ వన్ ఇయర్ స్టే మాత్రం కొనసగుతుంది. 3 నుంచి 6 నెలలపాటు విదేశాల్లో ఉంటే, పర్సనల్ హౌస్‌హోల్డ్ ఐటమ్స్ 60,000 విలువ చేసేవి తీసుకురావచ్చు. 6-12 నెలల వారికి ఈ మొత్తం 100,000గా ఉంటుంది. 1 నుంచి 2 ఏళ్ళ వారికి 200,000గా ఉంది. 2 ఏళ్ళకు పైబడి అయితే 500,000 వరకు ఛాన్స్ ఇచ్చారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







