జూన్ 9 వరకు ముందస్తు జాగ్రత్త నిబంధనల్ని పొడిగించిన యూఏఈ
- April 27, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమా అథారిటీస్, కోవిడ్ 19 భద్రతా నిబంధనల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 8 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి. పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కువమంది గుమికూడకుండా వుండడం, సోషల్ గేదరింగ్స్ వంటివాటిపై నిబంధనలు వర్తిస్తాయి. పబ్లిక్ బీచ్ అలాగే పార్కుల్లో 70 శాతం సామర్థ్యానికే అనుమతినిస్తారు. షాపింగ్ మాల్స్ 60 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. పబ్లిక్ రవాణా 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమాలు, వినోద కేంద్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాల్సి వుంటుంది. జిమ్ అలాగే ఫిట్-నెస్ కేంద్రాలు కూడా 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి. ఓ కుటుంబం అలాగే సోషల్ గేదరింగ్స్ విషయానికొస్తే 10 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందిని అనుమతిస్తారు. 2 మీటర్ల ఫిజికల్ డెస్టెన్సింగ్ పాటించాలి. రెస్టారెంట్లు కేఫ్స్ విషయానికొస్తే, టేబుళ్ళ మధ్య 2 మీటర్ల దూరం వుండాలి. ఒక్కో టేబుల్ పరిమితి నలుగురు వ్యక్తులకే.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









